CRIME NEWS: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం వద్ద పూజలు

తాజా వార్తలు

Published : 14/08/2021 01:13 IST

CRIME NEWS: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం వద్ద పూజలు

జగిత్యాల: ప్రపంచమంతా గ్లోబల్‌ విలేజ్‌గా మారినా .. కొందరు మూఢ నమ్మకాలపై అపోహలు మాత్రం వీడటం లేదు. చనిపోయిన వ్యక్తిని  బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేసిన ఘటన జగిత్యాల టీఆర్‌ నగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్‌ మండలం  టీఆర్‌ నగర్‌లో ఓర్సు రమేష్‌ మృతి చెందాడు. మంత్రాల కారణంగానే రమేష్ మృతి చెందాడని.. పుల్లయ్య అనే వ్యక్తిని బాధిత కుటుంబ సభ్యులు చితక బాదారు. తానే మంత్రాలతో రమేష్‌ని చంపానని, మంత్రాలతో మళ్లీ బతికిస్తానంటూ ఉదయం నుంచి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం మొదలుపెట్టాడు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌ మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని