AP News: రూ.9 వేల కోట్ల డ్రగ్స్‌ కేసు.. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై విచారణ!

తాజా వార్తలు

Published : 20/09/2021 14:58 IST

AP News: రూ.9 వేల కోట్ల డ్రగ్స్‌ కేసు.. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై విచారణ!

అమరావతి: గుజ్‌రాత్‌లో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకోవడం.. ఆ  మత్తు పదార్థాల దిగుమతి కేంద్రంగా విజయవాడ ఉండటం ప్రకంపనలు రేపుతోంది. పండ్ల వ్యాపారం కోసం ఏర్పాటు చేసినట్లు చెబుతున్న ఆషీ ట్రేడింగ్ కంపెనీలో మత్తు మందుల వ్యాపారం లింక్‌ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంస్థ పేరిట ఉన్న ఫోన్‌ నంబర్‌ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నెల 15న జప్తు చేసిన హెరాయిన్‌ విజయవాడలోని సంస్థకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు.

సంస్థ వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలపై కూపీ లాగుతున్నారు. కాకినాడ, విజయవాడ, చెన్నైలో సంస్థ మూలాలు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ ఉన్నట్లు తేల్చారు. గతేడాది 18న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు.. దుర్గా పూర్ణ వైశాలి గోవిందరాజు పేరిట కంపెనీ స్థాపించినట్లు గుర్తించారు. ఎం.సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద ఫోన్‌ నంబర్‌ నమోదైనట్లు పోలీసులు తేల్చారు. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని