crime news: చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 25/07/2021 05:07 IST

crime news: చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

హైదరాబాద్‌: చర్లపల్లి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న షేక్‌ ఖాజామియా(35) ఆత్మహత్య చేసుకున్నాడు. టవల్‌తో జైలులోని కిటికీకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఖాజామియా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 17 రోజుల క్రితం కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ కేసులో అరెస్టయిన ఖాజామియాను పోలీసులు మల్కాజ్‌గిరి కోర్టులో హాజరు పర్చగా కోర్టు రిమాండ్‌ విధించింది. అప్పటి నుంచి చర్లపల్లి జైలులో ఉంటున్నాడు. అతని స్వస్థలం తాళ్లగడ మిర్యాలగూడ అని జైలు సిబ్బంది తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని