crime news: రాహుల్‌ హత్యకేసు.. పోలీసుల అదుపులో కోగంటి సత్యం

తాజా వార్తలు

Updated : 24/08/2021 04:28 IST

crime news: రాహుల్‌ హత్యకేసు.. పోలీసుల అదుపులో కోగంటి సత్యం

విజయవాడ: యువ పారిశ్రామిక వేత్త రాహుల్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌ను నిన్న అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారించిన పోలీసులు ఇవాళ మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్‌ కోగంటి సత్యంను బెంగళూరులో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు. ఈకేసులో కోరాడ విజయ్‌కుమార్‌ ఏ1, అతడి భార్య పద్మజ ఏ2, మరో మహిళ గాయత్రి ఏ3, కోగంటి సత్యం నాలుగో నిందితుడిగా ఉన్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని