Road Accident: ఓఆర్‌ఆర్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి

తాజా వార్తలు

Updated : 01/09/2021 10:09 IST

Road Accident: ఓఆర్‌ఆర్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి

హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా తానేదార్‌పల్లి ఎంపీటీసీ కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 22న స్వగ్రామంలో వీరి కూతురి వివాహం జరిగింది. ఆ వేడుకలు ముగించుకొని వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్‌లోని తమ నివాసానికి నిన్న రాత్రి బయల్దేరారు. పెద్ద అంబర్‌పేట్‌ వద్దకు రాగానే వేణుగోపాల్ దంపతుల స్కార్పియో వాహనం మలుపు తీసుకుంటున్న టిప్పర్‌ను వెనక వైపు నుంచి ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే  మృతి చెందారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని