4 రోజుల్లో వివాహం.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ దుర్మరణం

తాజా వార్తలు

Updated : 23/08/2021 11:33 IST

4 రోజుల్లో వివాహం.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ దుర్మరణం

కదిరి: మరో నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎర్రదొడ్డికి చెందిన మహేష్ (26) మృతి చెందాడు. ఈ నెల 27న కదిరిలో మహేశ్‌ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి బయలుదేరిన మహేష్ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. 
ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చారు. త్వరలో ఓ ఇంటి వాడివై కోడలితో కలిసి జంటగా వస్తావనుకుంటే అందరిని వదిలేసి వెళ్లావా అంటూ బంధువుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని