Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

తాజా వార్తలు

Updated : 09/08/2021 11:18 IST

Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

అమ్రేలీ: గుజ్‌రాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు వృద్ధులతో సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. బదడ గ్రామంలో రోడ్డు పక్కన గుడిసెలో నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాజ్‌కోట్‌ నుంచి జఫ్రాబాద్‌ వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న 10 మందిలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని