Road Accident: జనగామలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం.. 

తాజా వార్తలు

Updated : 18/10/2021 11:07 IST

Road Accident: జనగామలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం.. 

కర్నూలులో లారీని ఢీకొన్న బస్సు.. ప్రయాణికులు సురక్షితం

నెల్లుట్ల: జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ప్రైవేట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు పూర్తిగా బయటపడ్డారు. బస్సు ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 

మరోవైపు ఏపీలో కర్నూలు సమీపంలోని రింగ్‌రోడ్డు వద్ద ప్రైవేట్‌ బస్సు లారీని ఢీకొట్టింది. బస్సు కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. బస్సులో ఉన్న 49 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌కు గాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మరో బస్సు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు తాలూకా పీఎస్‌ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని