AP News: చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి మృతి

తాజా వార్తలు

Updated : 20/10/2021 16:18 IST

AP News: చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి మృతి

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులోని మిగతా విద్యార్థులను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బడివానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి రాజు(8) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులన్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో పడిన కొంగర గ్రామానికి చెందిన బస్సును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామానికి చెందిన ప్రజలు చెరువు వద్దకు భారీగా చేరుకున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని