TS NEWS: మరిపెడ ఎస్‌ఐపై  ట్రైనీ ఎస్‌ఐ లైంగిక వేధింపుల ఆరోపణలు

తాజా వార్తలు

Updated : 03/08/2021 18:16 IST

TS NEWS: మరిపెడ ఎస్‌ఐపై  ట్రైనీ ఎస్‌ఐ లైంగిక వేధింపుల ఆరోపణలు

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మహిళా ట్రైనీ ఎస్‌ఐపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. గత రాత్రి ఎస్‌ఐ అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు.

డీజీపీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్‌ ఆందోళన

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళా ట్రైనీ ఎస్పైపై ఆత్యాచారయత్నం ఘటనను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్‌ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.  డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు వెళ్లగా.. పోలీసులు డీజీపీ కార్యాలయం గేట్లు మూసివేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ నేతలు అక్కడే ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావ్‌తో పాటు పలువురు ఆందోళనలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని