కళాశాలలో ఘర్షణ.. విద్యార్థిని భవనం పైనుంచి తోసేసిన మరో విద్యార్థి

తాజా వార్తలు

Updated : 25/09/2021 12:55 IST

కళాశాలలో ఘర్షణ.. విద్యార్థిని భవనం పైనుంచి తోసేసిన మరో విద్యార్థి

నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నేపల్లి శివారు బిట్స్‌ కళాశాలలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్న సంజయ్‌ను మరో విద్యార్థి భవనంపై నుంచి తోసేయడంతో కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొడవకు గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్‌ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని