AP News: తండ్రి మందలించాడని రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 28/10/2021 11:30 IST

AP News: తండ్రి మందలించాడని రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

తాడిపత్రి గ్రామీణం: తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బంధువులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన హమాలీ కుమారుడు నవీన్‌ (21) పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, నవీన్‌ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు. 

ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో నవీన్‌కు తండ్రి ఫోన్‌ చేసి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్‌.. రాత్రి ఇంటికి వెళ్లకుండా బయటే ఉన్నాడు. గురువారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని