Hyderabad news: పెళ్లయిన అరగంటలోనే వధువు అదృశ్యం

తాజా వార్తలు

Published : 19/09/2021 01:22 IST

Hyderabad news: పెళ్లయిన అరగంటలోనే వధువు అదృశ్యం

హైదరాబాద్‌: వివాహం జరిగిన అరగంటలోనే పెళ్లి కూతురు అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన ఓ యువతితో బెంగళూరుకు చెందిన వ్యక్తికి వివాహం నిశ్చయమైంది. నిన్న రాత్రి నబీల్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఇద్దరికీ వివాహం జరిగింది. అబ్బాయి తరఫున యువతికి దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారం, రూ.50వేల నగదు ఇచ్చారు. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెళ్లి కుమార్తె బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని పట్టుబట్టి మరీ వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు కంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాలాపూర్‌ పోలీసులు తెలిపారు. పెళ్లి కుమార్తె తన ప్రియుడితో కలిసి పరారైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని