Crime news: ఇంటిపై పిడుగుపడి రూ.20లక్షల నగదు, బంగారం దగ్ధం

తాజా వార్తలు

Published : 19/09/2021 01:30 IST

Crime news: ఇంటిపై పిడుగుపడి రూ.20లక్షల నగదు, బంగారం దగ్ధం

చింతలపూడి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం సాయంత్రం ఓ ఇంటిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఉన్న రూ.20లక్షల నగదు దగ్ధమైందని బాధితులు చెబుతున్నారు. తమ కుమారుడి చదువు కోసం ఇటీవల పొలం విక్రయించగా వచ్చిన రూ.20లక్షల నగదు ఇంట్లో ఉంచామని, పిడుగు పడటంతో నగదు మొత్తం మంటల్లో కాలిపోయాయని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. నగదుతో పాటు ఇంట్లో ఉన్న 50కాసుల బంగారం కూడా దగ్దమైందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని