Crime news: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రూ.55లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌

తాజా వార్తలు

Published : 26/09/2021 01:42 IST

Crime news: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రూ.55లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి.. మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్‌ శ్రీనివాస్‌కు రూ.55లక్షలు ఇచ్చారు. కానీ శ్రీనివాస్‌ ఆ డబ్బు  స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వకుండా రూ.55లక్షలు, కారుతో సహా ఉడాయించాడు. సంతోష్‌ ఫోన్‌చేయగా.. శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని