ఫ్రెండ్‌షిప్‌ డే రోజున విషాదం.. గోదావరిలో ముగ్గురి గల్లంతు

తాజా వార్తలు

Published : 02/08/2021 01:15 IST

ఫ్రెండ్‌షిప్‌ డే రోజున విషాదం.. గోదావరిలో ముగ్గురి గల్లంతు

నందిపేట: స్నేహితుల దినోత్సం రోజున యువకుల విహారయాత్ర విషాదం నింపింది. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు నందిపేట మండలం నడికూడ శివారులో గోదావరి నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వీరు నదిలో స్నానాలు చేయడానికి దిగారు. లోతును అంచనా వేయలేక ముగ్గురు యువకులు రాహుల్‌(20), ఉదయ్‌(19), శివ(19) నీటిలో మునిగిపోయారు. వీరిని గమనించిన మిగతా ముగ్గురు స్నేహితులు నీటమునిగిన వారిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని