Hyderabad: దారుణం.. పసికందు ప్రాణం తీసిన దంపతుల గొడవ

తాజా వార్తలు

Published : 25/09/2021 01:17 IST

Hyderabad: దారుణం.. పసికందు ప్రాణం తీసిన దంపతుల గొడవ

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ పసికందు ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఉన్న భర్త.. భార్యపై చేయిచేసుకున్నాడు. భార్యను కొడుతున్న క్రమంలో 22 రోజుల పసికందు చనిపోయింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ డివిజన్‌ పూసలబస్తీ పరిధి క్రాంతి నగర్‌బస్తీకి చెందిన పొదిల రాజేష్‌ అలియాస్‌ రాజు (36), జాహ్నవి (25) దంపతులు. రాజేష్‌ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ మద్యం తాగారు. మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవకు దిగారు. ఆవేశంలో భర్త ప్లాస్టిక్‌ పైపుతో భార్య మీద దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమె తన 22 రోజుల శిశువును అడ్డుగా పెట్టింది. ఈ గొడవలో చిన్నారి కంటిపై దెబ్బతగిలింది. భార్య తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువు గొంతును గట్టిగా పట్టుకుంది. ఊపిరాడకపోవడంతో పసికందు అపస్మారకస్థితికి చేరింది. స్థానికులు గమనించి హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రాజేశ్‌, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం వారి తొలి సంతానం.. (ఐదు నెలల బాబు)ను మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో ఉంచారు. రెండో కుమారుడు వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ కె. సుబ్బిరామరెడ్డి వివరాలు సేకరించారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని