ap news: ప్రైవేటు బస్సులో తరలిస్తున్న 2కిలోల బంగారం స్వాధీనం

తాజా వార్తలు

Published : 26/07/2021 02:01 IST

ap news: ప్రైవేటు బస్సులో తరలిస్తున్న 2కిలోల బంగారం స్వాధీనం

గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రెండు కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం తీసుకెళ్తున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన సాహిల్‌ బొర్డియాగా గుర్తించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బంగారు ఆభరణాలు తరలించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు  గన్నవరం సీఐ శివాజీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని