Crime News: ఉర్సు ఉత్సవ ఏర్పాట్లపై ఘర్షణ.. ఇద్దరు మృతి

తాజా వార్తలు

Updated : 28/10/2021 04:47 IST

Crime News: ఉర్సు ఉత్సవ ఏర్పాట్లపై ఘర్షణ.. ఇద్దరు మృతి

ఇచ్చోడ: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాల్లో డీజే ఏర్పాటు విషయమై ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో ఏటా ఉర్సు ఉత్సవాన్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఉత్సవం నిర్వహించేందుకు బుధవారం రాత్రి గ్రామంలోని ఓ వర్గం వారు ఏర్పాట్లు చేపట్టారు. ఏర్పాట్లలో భాగంగా డీజే విషయమై మరో వర్గం వారితో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా.. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో భారీగా మోహరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని