Crime news: ఇద్దరు నేపాల్‌ దొంగలు అరెస్టు: భారీగా సొత్తు స్వాధీనం

తాజా వార్తలు

Updated : 26/09/2021 02:35 IST

Crime news: ఇద్దరు నేపాల్‌ దొంగలు అరెస్టు: భారీగా సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని రాయదుర్గం టెలిఫోన్‌ కాలనీలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్, పవిత్ర దంపతులను షోలాపూర్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.7.2లక్షల నగదు, 1.1 కేజీల బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన వెంటనే స్పందించామని, నాలుగు బృందాలు ఏర్పాటు చేసి నాలుగు రాష్ట్రాలకు పంపించామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సాంకేతిక ఆధారాలు సహా పక్కా సమాచారంతో నిందితులను షోలాపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నామని వెల్లడించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని