Viveka murder case: ముమ్మరంగా వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు

తాజా వార్తలు

Published : 31/07/2021 16:48 IST

Viveka murder case: ముమ్మరంగా వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 55వ రోజు సీబీఐ విచారణ కొనసాగింది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఆరుగురు అనుమానితులు సీబీఐ విచారించింది. వీరిలో తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పనిచేసే ఉదయ్ కుమార్ రెడ్డి వరుసగా రెండో రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయ్‌తో పాటు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన లోకేష్ యాదవ్, గోవర్ధన్, అనంతపురంలోని మాచినేని గ్రాండ్ హోటల్ మేనేజర్ రాజు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు.  గతంలో సునీల్ కుమార్ యాదవ్ అనంతపురంలో ఉన్న సమయంలో మాచినేని గ్రాండ్ హోటల్‌కి వెళ్లిన్నట్లు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. అందులో భాగంగానే 2018-2019లో హోటల్‌కు వచ్చిన వారి వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆ వివరాతో రాజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పులివెందులకు చెందిన మరో ఇద్దరు అనుమానితులనూ అధికారులు ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని