VIVEKA MURDER CASE: సునీల్‌ యాదవ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన పులివెందుల కోర్టు

తాజా వార్తలు

Updated : 04/08/2021 18:38 IST

VIVEKA MURDER CASE: సునీల్‌ యాదవ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన పులివెందుల కోర్టు

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అనుమానితుడు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు బుధవారం  కోర్టులో హాజరుపర్చారు. సీబీఐ అధికారుల బృందం సునీల్‌ను కడప నుంచి పులివెందుల తీసుకెళ్లి అక్కడ మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. నిన్న గోవా నుంచి తీసుకొచ్చిన అధికారులు రోజంతా కడప కేంద్రకారాగారంలో విచారించారు. ఇవాళ ఉదయం కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కడప నుంచి పులివెందులకు సునీల్‌ను తీసుకెళ్లి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చారు. కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ గత 20 రోజులుగా సీబీఐ అధికారుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గోవాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్‌ వారంట్‌పై కడప తీసుకొచ్చారు. సునీల్‌ యాదవ్‌కు పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కడప జిల్లా జైలుకు తరలించారు. సునీల్‌ యాదవ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని