VIVEKA MURDER CASE: అనుమానితుల ఇళ్లలో కత్తి, కొడవలి స్వాధీనం చేసుకున్న సీబీఐ

తాజా వార్తలు

Updated : 11/08/2021 19:46 IST

VIVEKA MURDER CASE: అనుమానితుల ఇళ్లలో కత్తి, కొడవలి స్వాధీనం చేసుకున్న సీబీఐ

పులివెందుల: వైఎస్‌ వివేకా హత్యకేసుకు సంబంధించి కీలక అనుమానితులు సునీల్‌ యాదవ్‌, మాజీ డ్రైవర్‌ దస్తగిరి కుటుంబ సభ్యుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కత్తి, కొడవలి, పలుగు, పార వంటి కొన్ని వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైఎస్‌ అభిషేక్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీల కోణంలోనూ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహానికి కర్ణాటక నుంచి రెవెన్యూ, బ్యాంకు అధికారులు వచ్చారు. కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌కు సంబంధించి వివేకా, సునీల్‌ మధ్య వివాదం కోణంలో బ్యాంకు అధికారులను సీబీఐ అధికారులు పిలిచినట్టు సమాచారం. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సీబీఐ అధికారులను మరోసారి కలిశారు. 

వివేకాను హత్యచేసింది ఎవరో అందరికీ తెలుసుని సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌ యాదవ్‌ అన్నారు. సీబీఐ సోదాల అనంతరం కిరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్యాయంగా సునీల్‌ యాదవ్‌ను ఈకేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు. సీబీఐ వేధింపులు తాళలేకే హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని