vivekamurder case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు

తాజా వార్తలు

Updated : 10/08/2021 18:22 IST

vivekamurder case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పులివెందుల గెస్ట్‌హౌస్‌లో ఇవాళ 8మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డి, హోంగార్డు నాగభూషణం, బాలకృష్ణారెడ్డి, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లి, సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీబీఐ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని