Crime News: హైదరాబాద్‌లో వరకట్న వేధింపులకు వివాహిత బలి

తాజా వార్తలు

Updated : 13/09/2021 04:54 IST

Crime News: హైదరాబాద్‌లో వరకట్న వేధింపులకు వివాహిత బలి

హైదరాబాద్‌: హైదరాబాద్ మియాపూర్‌లో వరకట్న దాహానికి ఓ వివాహిత బలైంది. భర్త, ఆడపడుచు, అత్తమామల వరకట్న వేధింపులు భరించలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని పావని అనే వివాహిత తనువు చాలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లాపూర్‌కు చెందిన మల్లారెడ్డి కుమార్తె పావని రెడ్డికి మియాపూర్ నివాసి శ్రావణ్ కుమార్ రెడ్డితో గత ఏడాది వివాహం జరిగింది. పావని, శ్రావణ్ కుమార్‌లు మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ మెట్రో పోలీస్‌లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా తెల్లాపూర్‌లో విల్లా కావాలని శ్రావణ్ కుమార్ పావనిపై ఒత్తిడి తీసుకురావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన కుటుంబసభ్యులతో మాట్లాడవద్దని, దూరంగా ఉండాలని పావనికి చెప్పిన శ్రావణ్‌.. గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పావని ఇంట్లో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. శ్రావణ్ కుమార్ రెడ్డి వేధింపుల వల్లే తన కుమార్తె మరణించిందని పావని తండ్రి మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని