AP News: యువతి అనుమానాస్పద మృతి.. రాత్రికి రాత్రే అంత్యక్రియలు

తాజా వార్తలు

Updated : 11/08/2021 12:38 IST

AP News: యువతి అనుమానాస్పద మృతి.. రాత్రికి రాత్రే అంత్యక్రియలు

వట్టిచెరుకూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో భవాని(18) అనే యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు సత్యం, సుజాత చెబుతున్నారు. కాగా, రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అంత్యక్రియలను రహస్యంగా ఎందుకు చేశారని భవాని తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఈ అడిగిన ప్రశ్నకు.. భవాని తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పలేదు. అనంతరం కడుపునొప్పితో యువతి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఈ సమాచారం మేరకు యువతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఘటనాస్థలిలో వివరాలు సేకరించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని