Murder: కడప జిల్లాలో వైకాపా సర్పంచ్‌ దారుణ హత్య

తాజా వార్తలు

Updated : 28/07/2021 13:19 IST

Murder: కడప జిల్లాలో వైకాపా సర్పంచ్‌ దారుణ హత్య

లింగాల: కడప జిల్లా లింగాల మండలం కోమనూతల సర్పంచ్‌ దారుణహత్యకు గురయ్యారు. వైకాపాకు చెందిన సర్పంచ్‌ మునెప్ప(50)ను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. సర్పంచ్‌ల శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు మునెప్ప పులివెందులకు వెళ్లారు. తన ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో 150 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా మునెప్ప గెలుపొందారు. ఆధిపత్య పోరుతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని