Zero FIR on tadepalli SI: తాడేపల్లి ఎస్‌ఐపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు

తాజా వార్తలు

Published : 26/07/2021 01:58 IST

Zero FIR on tadepalli SI: తాడేపల్లి ఎస్‌ఐపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ బాలకృష్ణ తనను మోసం చేశారంటూ ఓ మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్పందించిన పోలీసులు ఆ మహిళపై వెంటనే నీళ్లు పోసి పక్కకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఎస్‌ఐని వీఆర్‌కు పిలిచారు. గతంలో గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇదే మహిళ తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు బాలకృష్ణపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం తాడేపల్లికి బదిలీ చేశారు. ఈనెల 23న రాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మళ్లీ అదే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలకృష్ణ మోసం చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని