close

తాజా వార్తలు

Published : 12/04/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కల్యాణదుర్గంలో చిచ్చురేపిన ప్రేమ వ్యవహారం 

కల్యాణదుర్గం: ప్రేమ జంట విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతపురం జిల్లా  కల్యాణదుర్గం పట్టణానికి చెందిన యువకుడు అదే ప్రాంతంలోని ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాలకు మధ్య వివాదం రేగింది.

 దీనికి తోడు ఇరు కుటుంబాలకు వారి సామాజిక వర్గాలు మద్దతు తెలపడంతో  వివాదం మరింత ముదిరింది. తమపై దాడి చేసి గాయపరిచిన వారిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తమనే దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఓ వర్గం వారు ధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న రాము, తిప్పేస్వామి, పల్లవి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వారంతా ర్యాలీగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని సీఐ శివశంకర్‌నాయక్‌ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని