close

తాజా వార్తలు

Updated : 27/02/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిద్దిపేటలో గోవధ.. 8మంది అరెస్టు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం శివారులో గోవధ ఉదంతం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి 8మందిని అరెస్టు చేసినట్టు  సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట శివారులోని పాత పుల్లూరు రోడ్డులో ఓ కోళ్లఫారం షెడ్డులో కొందరు వ్యక్తులు దాదాపు 40 వరకు మూగజీవాలను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి బంధించారు. 

మాంసం విక్రయానికి 15 జీవాలను వధించారు. ఈ విషయం స్థానికుల ద్వారా భాజపా, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, హిందూవాహిని, తదితర సంస్థలకు చెందిన నేతలు, శ్రేణులకు తెలియడంతో ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌ వద్ద పలువురు నిరసనకు దిగారు. ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారికి సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. అప్పటికే గోవులను వధించినవారు పరారయ్యారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ రామేశ్వర్‌, వన్‌టౌన్‌ సీఐ సైదులు, పోలీసులు చేపట్టారు. పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ పాతబస్టాండ్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు, సున్నిత ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వధించిన ఆవులను గుర్తించి వెటర్నరీ డాక్టర్‌తో పోస్టు మార్టం చేయించారు. షెడ్డులో కట్టేసిన ఆవులను గోశాలకు తరలించినట్టు సీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వదంతులు నమ్మవద్దని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే సమాచారమందించాలని సూచించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని