Terror Attack: భద్రతాదళాలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి.. శ్రీనగర్‌లో ఘటన

తాజా వార్తలు

Published : 11/08/2021 01:55 IST

Terror Attack: భద్రతాదళాలే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి.. శ్రీనగర్‌లో ఘటన

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగుతున్నారు. సోమవారం కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో భాజపా నేత, ఆయన భార్యను కాల్చి చంపిన ముష్కరులు.. మంగళవారం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌ దాడి చేశారు. శ్రీనగర్‌లోని హరిసింగ్‌ హైస్ట్రీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానికులు గాయపడినట్లు సమాచారం.  ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్‌ డీఐజీ కిశోర్‌ప్రసాద్‌ ధ్రువీకరించారు. ‘మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఒక దుండగుడు గ్రెనేడ్‌తో భద్రతా దళాల బంకర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాడు. అయితే ఈ ఘటనలో భద్రతాదళాలకు ముప్పు తప్పిందని సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ స్థానికంగా ఉగ్రవాదుల వరుస దాడులు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని