కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో బోటు దగ్ధం 

తాజా వార్తలు

Published : 23/01/2021 01:53 IST

కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో బోటు దగ్ధం 

జగన్నాథపురం (కాకినాడ): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఓ చేపల బోటు శుక్రవారం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన బొడ్డు నూకరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

కాకినాడలోని ఏటిమొగకు చెందిన పంతాటి కామేశ్వరరావు తన బోటు (ఐఎన్‌డీ-ఏపీ-ఈ2-717)లో సుమారు 4 వేల లీటర్ల డీజిల్‌ నింపుకొని చేపల వేటకు సిద్ధమవుతుండగా షార్ట్‌సర్క్యూట్‌ అయి ఆయిల్‌ ట్యాంక్‌ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో బోటు మొత్తం పూర్తి దగ్ధమైంది. ఈ ఘటనపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలోని క్షతగాత్రులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పరామర్శించారు. 

ఇవీ చదవండి..

ప్రేమ పేరుతో ఉన్మాది ఘాతుకం

శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని