చిన్నారిపై అత్యాచారం..దోషికి 20ఏళ్ల జైలు
close

తాజా వార్తలు

Published : 27/04/2021 00:57 IST

చిన్నారిపై అత్యాచారం..దోషికి 20ఏళ్ల జైలు

హైదరాబాద్‌: చిన్నారిపై అత్యాచారం కేసులో నాంపల్లిలోని మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు, రూ.25వేల జరిమానా విధించింది. ఈ మేరకు దోషి చెన్నయ్యకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబరులో బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై చెన్నయ్య (50)అత్యాచారానికి పాల్పడ్డాడు. బొమ్మలు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో సెక్టార్‌ ఎస్సై రవిరాజ్‌ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన దంపతులు ఫిలింనగర్‌ ప్రాంతంలో నివసించేవారు. వారికి ముగ్గురు పిల్లలు. వారిని ఇంట్లో ఉంచి చుట్టుపక్కల ఇళ్లలో పనిచేయడానికి వెళ్లేవారు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె కనిపించకపోవడంతో ఆరా తీసింది. వెదుకుతుండగా రెండిళ్ల అవతల ఉన్న ఇంట్లో నుంచి బాలిక రావడం కనిపించింది. తల్లి ప్రశ్నించగా పక్కనుండే తాతయ్య తీసుకెళ్లారని, బొమ్మలు ఇచ్చి తలుపు వేశాడని సమాధానమిచ్చింది. మరో ఇంటిలో పని ఉండటంతో పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లిన ఆమె తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి బాలిక నొప్పిగా ఉందని రోదించింది. దీంతో తల్లి ఏం జరిగిందని అడగ్గా జరిగిన విషయం చెప్పింది. వెంటనే ఆమె భర్తతో కలిసి వృద్ధుడి ఇంటి వద్దకు వెళ్లారు. తాళం వేసిఉండటంతో అతని గురించి ఆరా తీశారు. ఆ ఇంటిలో చెన్నయ్య(50) ఉంటాడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని