
తాజా వార్తలు
మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ
ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో కొలువైన శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాలయంలో బుధవారం రాత్రి 11:30 గంటల వరకు గ్రామోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. గేట్లు, తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు...మల్లిఖార్జున స్వామికి ఇరువైపుల ఆసీనులైన భద్రకాళి, భ్రమరాంబికాదేవి మెడలో ఉన్న తాళి బొట్లు, ముక్కు పుడకలను అపహరించారు. గురువారం ఉదయం పూజలు చేయడానికి కోవెల వద్దకు వచ్చిన పూజారి నాగమల్లేశ్వర శర్మ చోరీ ఘటనను గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సింగయ్య ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి..
ట్రంప్ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
