చేతులు శానిటైజ్‌ చేసుకుని మరీ దోచుకున్నారు

తాజా వార్తలు

Published : 12/09/2020 16:19 IST

చేతులు శానిటైజ్‌ చేసుకుని మరీ దోచుకున్నారు

అలీగఢ్‌‌: కరోనా కాలం. మాస్క్‌ లేకుండా ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. దగ్గరకు వచ్చే వరకూ తెలిసిన వాళ్లను కూడా గుర్తు పట్టలేని పరిస్థితి. దీన్నే అవకాశంగా తీసుకున్నారు ముగ్గురు దొంగలు. మాస్క్‌లు ధరించి నగల దుకాణంలోకి ప్రవేశించారు. వినియోగదారులకుని భ్రమపడి ఆ దుకాణ యజమాని చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌ కూడా ఇచ్చాడు. అంతే, ఆ దుండగలు తమ వద్ద ఉన్న తుపాకులు తీసి షాపులో ఉన్న వారిని బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌లోనిలోని ఓ నగల దుకాణంలో చోటు చేసుకుందీ ఘటన. ఈ తతంగం అంతా సీసీ టీవీలో రికార్డవడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రూ.40 లక్షల విలువ చేసే నగలు, రూ.50 వేల నగదు దోపిడీ జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని