డబ్బు కోసం రాజకీయ నేతలకు బెదిరింపులు

తాజా వార్తలు

Updated : 04/07/2021 04:29 IST

డబ్బు కోసం రాజకీయ నేతలకు బెదిరింపులు

హైదరాబాద్‌: డబ్బుల కోసం రాజకీయ నాయకులను బెదిరిస్తున్న ముగ్గురు యువకులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మోటకొండూరు మండలం మాటూర్‌ గ్రామానికి చెందిన క్రాంతికుమార్‌ ఉప్పల్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. అతని సోదరుడు సింహాద్రి, జశ్వంత్‌ డిగ్రీ చదువుతున్నారు. చరవాణి అప్లికేషన్లు రూపొందించాలని సింహాద్రి లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం అవసరమైన రూ.5కోట్ల పెట్టుబడిని ఎలాగైనా సమీకరించాలనుకున్నాడు.

స్నేహితుడితో పాటు అన్నకు ఈవిషయం చెప్పాడు. రాజకీయ నాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని ముగ్గురూ కుట్రపన్నారు. ఉప్పల్‌లో వీధి వ్యాపారం చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి చరవాణి దొంగిలించారు. ఆ చరవాణి ద్వారా యాదగిరిగుట్టకు చెందిన రాజకీయ నాయకుడు అంజయ్య, ఆలేరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్‌ను బెదిరించారు. ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాంకేతికతను ఉపయోగించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని