ముగ్గురు పిల్లలకు ఉరివేసి..తల్లి బలవన్మరణం

తాజా వార్తలు

Updated : 08/07/2021 13:16 IST

ముగ్గురు పిల్లలకు ఉరివేసి..తల్లి బలవన్మరణం

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. రామ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసవ్వడం, కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో రాణి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. చిన్న కుమార్తె మెడనుంచి చీర జారిపోవడంతో ఆమె బయటపడింది. తల్లి ఉమారాణి (31)తోపాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి (13), లక్కీ (11) ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్‌లో విషాదం ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని