దేవరకద్రలో గుట్టపై మృతదేహాల కలకలం! 

తాజా వార్తలు

Published : 27/05/2021 00:20 IST

దేవరకద్రలో గుట్టపై మృతదేహాల కలకలం! 

దేవరకద్ర: మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర సమీపంలో గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. వీటిని గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక యువకుడు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. మృతులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముగ్గురూ దేవరకద్రకు చెందిన తల్లి, కుమారుడు, కుమార్తెగా గుర్తించారు. గుడికి వెళ్తున్నామని చెప్పి సోమవారం తల్లీపిల్లలు బయటకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని