ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం... ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Published : 15/03/2021 01:19 IST

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం... ముగ్గురి మృతి

శామీర్‌పేట్(మేడ్చల్‌): హైదరాబాద్‌ ఔటర్‌ రింగుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న కంటెయినర్‌ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శామీర్‌పేట సీఐ సంతోషం తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన అనుమొల్ల కరుణాకర్‌రెడ్డి(45), ఆయన  భార్య సరళ(38), మరదలు సంధ్య(30) ఆదివారం ఉదయం 11 గంటలకు ఉప్పల్‌ నుంచి సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం చిన్న కిష్టాపూర్‌ గ్రామంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి సాయంత్రం తిరుగు ప్రయాణంలో రాజీవ్‌ రహదారి మీదుగా టోల్‌ గేట్‌లోకి ప్రవేశించి ఘట్‌కేసర్‌ వైపునకు ప్రయాణించారు. ఈ క్రమంలో టోల్‌ గేట్‌ దాటిన రెండు కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా 25ఏళ్ల క్రితం కిష్టాపూర్‌ నుంచి ఉప్పల్‌కు వలస వచ్చి రైస్‌ డిపో నడుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని