TS News: సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల బలి

తాజా వార్తలు

Updated : 05/07/2021 11:43 IST

TS News: సెల్ఫీ సరదాకు ముగ్గురు బాలికల బలి

తానూర్‌: సెల్ఫీ సరదా ముగ్గురు బాలికలను బలిగొన్న ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తానూర్‌ మండలం సింగన్‌గావ్‌లో చెరువులో పడి అక్కాచెల్లెళ్లు అస్మిత(15), వైశాలి(13) వారి బంధువుల అమ్మాయి అంజలి(15) మృతిచెందారు. ముథోల్‌ సీఐ అజయ్‌ బాబు తెలిపిన వివరాల మేరకు.. ఈ ముగ్గురు బాలికలు ఆదివారం మధ్యాహ్నం చేనుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైశాలి, అస్మిత వాళ్ల తల్లి మంగళబాయి ముగ్గురినీ ఇంటికి వెళ్లిపోవాలని చెప్పింది. ఇంటికి వెళ్లే క్రమంలో ముగ్గురు బాలికలు స్థానికంగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి గట్టు మీద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని