గోదావరిలో మునిగి ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Published : 20/03/2021 01:42 IST

గోదావరిలో మునిగి ముగ్గురి మృతి

భద్రాచలం: భద్రాచలం ఇంటేక్‌వెల్‌ ప్రాంతం వద్ద గోదావరిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో జరిగిన ఓ కార్యక్రమానికి రెండు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఐదుగురు స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు యత్నించారు. చరణ్‌(10), వరలక్ష్మి(35), సురేఖ(16) మృతి చెందగా.. భవాని, వీరబాబు సురక్షితంగా బయటపడ్డారు. వీరిద్దరినీ చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని