AP NEWS:మూడేళ్ల బిడ్డను చంపిన తల్లి?

తాజా వార్తలు

Published : 04/06/2021 01:05 IST

AP NEWS:మూడేళ్ల బిడ్డను చంపిన తల్లి?

మధురవాడ: విశాఖ మధురవాడలోని ఐదోవార్డు మారికవలస గ్రామంలో మూడేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మారికవలస గ్రామానికి చెందిన లారీ క్లీనర్‌ రమేశ్‌కు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మితో 2016లో వివాహమైంది. అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వరలక్ష్మికి అక్రమ సంబంధం ఉందని రమేశ్‌ అనుమానిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కాగా, మూడు నెలల క్రితం పాపతో సహా వరలక్ష్మి వేరే వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా బుధవారం వరలక్ష్మి రమేశ్‌కు ఫోన్‌చేసి పాప చనిపోయిందని తెలిపింది. దీంతో ఆవేదన చెందిన రమేశ్‌.. కుటుంబ సభ్యులతో కలిసి భార్య వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశారు. పాప మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని  బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. భార్యే తన కుమార్తెను చంపిందని రమేశ్‌ ఆరోపిస్తున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని