Titanic: ‘టైటానిక్‌’ ప్రమాదం.. ముగ్గురికి గాయాలు!

తాజా వార్తలు

Published : 05/08/2021 01:51 IST

Titanic: ‘టైటానిక్‌’ ప్రమాదం.. ముగ్గురికి గాయాలు!


(Photo: Titanic Museum Attraction Facebook)

పీజియన్‌ ఫోర్జ్‌: టైటానిక్‌ అంటే.. 109 ఏళ్ల కిందట జరిగిన టైటానిక్‌ ప్రమాదం గురించి కాదండీ.. ఆ టైటానిక్‌ ప్రమాదాన్ని ప్రతిబింబించేలా నకిలీ టైటానిక్‌, మంచుకొండను తయారు చేసి యూఎస్‌లో టెన్నెస్సీలోని పీజియన్‌ ఫోర్జ్‌ నగరంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. తాజాగా అక్కడ ఒక ప్రమాదం జరిగింది. అసలు టైటానిక్‌ ప్రమాదం ఓ మంచుకొండను ఢీకొట్టడం వల్ల జరిగితే.. తాజా ప్రమాదం ఆ మంచుకొండ ప్రతిమ కూలిపోవడంతో జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యూజియాన్ని పర్యటకులు సందర్శిస్తున్న సమయంలో నకిలీ టైటానిక్‌ను ఆనుకొని ఉన్న మంచుకొండ ప్రతిమ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ముగ్గురు పర్యటకులు శకలాల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలింగా మూసివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని