Crime news: మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడిపై చీటింగ్‌ కేసు నమోదు

తాజా వార్తలు

Published : 27/10/2021 01:09 IST

Crime news: మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడిపై చీటింగ్‌ కేసు నమోదు

సేలం: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె.పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు మణిపై మోసం కేసు నమోదైంది. ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.17లక్షలు తీసుకున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు సేలం పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైవేలి ప్రాంతానికి చెందిన తమిళ్‌ సెల్వన్‌ అనే వ్యక్తి రవాణా కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగం కోసం మణికి రూ.17లక్షలు చెల్లించాడు. అయితే, మణి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో, బాధితుడు తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేయగా అందుకు నిరాకరించడంతో పాటు బాధితుడిని బెదిరింపులకు గురిచేశారు. సేలం జిల్లా పూసరిపట్టికి చెందిన మణి, అతడి స్నేహితుడు సెల్వ కుమార్‌పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైం బ్రాంచ్‌ పోలీసులు సెక్షన్‌ 120 (బి), 420 సెక్షన్ల కింద నిందితులపై సోమవారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని