హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

తాజా వార్తలు

Updated : 19/07/2021 14:00 IST

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి.. 
గ్రామస్థుల ఆందోళనతో నిలిచిపోయిన వాహనాలు

దండుమల్కాపూర్‌: యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌ వద్ద విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరోనా టీకా కోసం వెళుతున్న యాదమ్మ(70) అనే వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వృద్ధురాలి మృతిని నిరసిస్తూ గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. అండర్‌పాస్‌ బ్రిడ్జి లేని కారణంగా ప్రమాదం జరిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారిపై ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులతో చౌటుప్పల్‌ ఏసీపీ శంకర్‌ మాట్లాడారు. పోలీసులు హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. అనంతరం వాహనాలు నెమ్మదిగా కదిలాయి.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని