
తాజా వార్తలు
ఏసీబీ అదుపులో మార్క్‌ఫెడ్ ఎండీ, జీఎం
హైదరాబాద్: తెలంగాణ గిడ్డంగుల సంస్థ, మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్‌రెడ్డిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు మంజూరు చేసేందుకు ఎండీ భాస్కరాచారి రూ.75వేల లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లిలో జీఎం సుధాకర్‌రెడ్డి రూ.75వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎండీ ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు సుధాకర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చెప్పారు. దీంతో ఎండీ భాస్కరాచారిని ఏ1గా, జీఎం సుధాకర్‌రెడ్డిని ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంతో పాటు కొత్తపేటలోని ఎండీ, జీఎం ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇవీ చదవండి..
నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా?: జేసీ
ప్రతి హిందువు భాగస్వామి కావాలి: బండి