
తాజా వార్తలు
తండ్రిచేతిలో గాయపడిన బాలుడి మృతి
హైదరాబాద్ : కన్న తండ్రిచేతిలో ఈనెల 18న తీవ్రంగా గాయపడిన చరణ్ (12) మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌కు చెందిన బాలు అనే వ్యక్తి కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పాఠశాల ఆవరణలో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. అతడి భార్య అదే పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తోంది. వీరి చిన్న కుమారుడు చరణ్ (12) ఆ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
ఆన్లైన్ క్లాసులకు హాజరుకాకపోవడంతోపాటు సరిగా చదవడం లేదంటూ కుమారుడిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశాడు. దీన్ని తల్లి అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. కుమారుడిపై పెయింటింగ్‌లకు ఉపయోగించే టర్పంటాయిల్ పోసి నిప్పంటించాడు. మంటలకు తట్టుకోలేక బాలుడు ఇంటి నుంచి బయటకి పరుగులు తీశాడు. ఈ క్రమంలో సమీపంలోని గోతిలో పడ్డాడు. స్థానికులు గుర్తించి ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశాడు. బాలుడి తండ్రి బాలును అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి...
మత్తు మందిచ్చి గొంతు కోసి చంపేశారు