కల్తీ గాళ్లు.. వేటినీ వదలడం లేదు!

తాజా వార్తలు

Updated : 04/07/2021 05:25 IST

కల్తీ గాళ్లు.. వేటినీ వదలడం లేదు!

హైదరాబాద్‌: చూడటానికి అచ్చం ఒరిజినల్‌లానే ఉంటాయి.. వాడితేగానీ, వాటి అసలు రంగు బయటపడదు. అంత పకడ్బందీగా కల్తీ చేసేస్తున్నారు. ఆఖరుకు టాయిలెట్లు, ఇల్లు శుభ్రం చేసుకునే ద్రావణాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి కల్తీ ద్రావణాలను తయారు చేసే ఓ ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాచిగూడకు చెందిన సంతోష్, షాపూర్నగర్‌కు చెందిన అరబింద్ కుమార్ సింగ్, రంజిత్ కుమార్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు రాజీవ్ గాంధీనగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని హార్పిక్, లైజాల్‌కు డూప్లికేట్ తయారుచేసే దందా నడిపిస్తున్నారు. సంతోష్ హార్పిక్, లైజాల్, ఖాళీ సీసాలు సమకూరుస్తుండగా మిగతా ఇద్దరూ నకిలీ క్లీనర్‌ ద్రవణాలను తయారుచేసి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. కాగా ఆయా కంపెనీల ప్రతినిధుల నుంచి తమకు వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు అరబింద్, రంజిత్ కుమార్ సింగ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సంతోష్‌ కోసం గాలిస్తున్నారు. వారి వద్ద నుంచి 1,440 హార్పిక్ బాటిళ్లు, 576 లైజాల్ బాటిళ్లు, ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని