నిమిషాల వ్యవధిలో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి

తాజా వార్తలు

Published : 06/02/2021 01:47 IST

నిమిషాల వ్యవధిలో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి

హైదరాబాద్‌ నారాయణగూడలో ఘటన

నారాయణగూడ: హైదరాబాద్‌ నారాయణగూడ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా కూప్పకూలి మృతి చెందారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన ఆంజనేయులు (45) శుక్రవారం తన ఆటోలో కాచిగూడ నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వస్తున్నాడు. నారాయణగూడ మెట్రో స్టేషన్‌ వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా ఆగడమే కాకుండా ఆంజనేయులు అందులోంచి కింద పడ్డాడు. ఈ క్రమంలో తల ఫుట్‌పాత్‌కు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మూర్చ రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

మరోవైపు ఈ కేసు విచారిస్తుండగానే వైఎంసీఏ మైదానంలో మరో ఆటో డ్రైవర్‌ ఉన్నట్టుండి కిందపడి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు యూపీకి చెందిన రాజేందర్‌(43)గా నిర్ధారించారు. చిక్కడపల్లిలో నివాసముంటూ ఆటో నడుపుకొంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భార్యను చంపేశాడు!
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని