కాణిపాకం వెళ్తూ ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి

తాజా వార్తలు

Updated : 08/03/2021 01:46 IST

కాణిపాకం వెళ్తూ ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి

చిత్తూరు జిల్లా ఐతేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

తిరుపతి: కాణిపాకం వెళ్తు్న్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల జీవితాలను ఆర్టీసీ బస్సు చిదిమేసింది. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్‌, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదువుతున్నారు. ఆదివారం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై కాణిపాకం బయల్దేరారు.  ఐతేపల్లి వద్దకు చేరుకోగానే చిత్తూరు నుంచి తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిరామ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలపాలైన అలేఖ్య తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని